పిల్లల ప్రపంచం ఆనంద మయమే. ఒక వైపున ప్రాణాలు హరించటంకోసం పిల్లి, ఆకాశంలోంచి దూకి ఎత్తుకుపోవటంకోసం గద్ద పొంచిఉన్నా సరే, కోడి పిల్లలు సమయం చూసుకొని నవ్వగలవు- ఏమంటే అవీ పిల్లలే కదా! అందుకని. జై సీతారాం కలం నుండి రాలిన మరో ఆణిముత్యం..ఇదిగో, మీకోసం. దీన్ని పవన్, హర్షలు పోటీ పడి పాడితే, దేన్ని ఉంచాలో తెలీక రెండింటినీ మీ ముందుకు తెస్తున్నాం.
రచన: ’కవికాకి’ కీ.శే. శ్రీ జై సీతారాం.
గానం: సి. పవన్, హర్ష రెండవ తరగతి, టింబక్టు బడి, చెన్నేకొత్తపల్లి, అనంతపురం జిల్లా.
డప్పు: టి. నాగార్జున, ఏడవ తరగతి, టింబక్టు బడి.
కోడి పిల్లలు అమ్మ చుట్టూ
ఆడుకుంటూ ఉన్నాయి
నల్ల పిల్లి గోడ వెనుక
నక్కీ నక్కీ పొంచుంది
నింగి నుండీ పెద్ద గద్ద
నేల మీదకు చూసింది
పిల్లి చెంగున దూకింది
గద్ద రివ్వున వాలింది
ఒక్కేసారి పిల్లీ గద్దా
డిక్కీ డీక్కీ ఢీ కొన్నాయి
పిల్లికి కన్ను పోయింది
గద్దకు రెక్క విరిగింది
కివ్ కివ్ గద్ద
మ్యావ్ మ్యావ్ పిల్లి
నవ్వీ నవ్వీ కోడి పిల్లలు
నాట్యమాడుతున్నాయి.