గాలిపటం గాలిపటం ఏల ఎగిరేవు? నేల మీద నడవలేక నింగికెగిరాను! రెక్కలు లేక ఎగిరీ ఎగిరీ ఎక్కడికెళ్తావు? చుక్కల వద్దకు చక్కగ వెళ్ళి చూసి వస్తాను! చుక్కల్లోన చందమామకు చిక్కిపోతావు చందమామకు అందకుండా సర్రున వస్తాను!
గాలిపటం నేలమీద నడవొచ్చుగా? ఆకాశంలోనే ఎందుకు ఎగరాలి? మరి దాన్ని చందమామ అందుకొని ఉంచేసుకుంటే ఎలా మరి? కవికాకికి వచ్చిన ఈ ఆలోచన గేయరూపం ధరించి మీ ముందుకు వస్తోంది. ఆస్వాదించండి.
గానం: పోతిరెడ్డి, మూడవ తరగతి, ప్రకృతి బడి, చెన్నేకొత్తపల్లి, అనంతపురం జిల్లా.