గానం: స్వాతి, పదో తరగతి
బృంద గానం: రామాంజనేయులు( అయ్యవారు), భారతి, పావని, షాహింతాజ్(పదో తరగతి)
డప్పు: పోతలయ్య
శ్రీ గణనాయకా సిద్ధి వినాయకా
మ్రొక్కెద వరములివ్వు మోక్షదాయకా
|శ్రీ గణనాయకా|
విద్యకెల్ల గురువునీవె శ్రీ గణేశా
ముద్దుమోము చూపవోయి శ్రీ గణేశా
చదువుల గురువని మది నిను నమ్మితి
సతతము బ్రోవవయ్య శ్రీ వినాయకా
|శ్రీ గణనాయకా|
వ్యాస మహా మునీంద్రుని కోర్కె తీర్చినావు
భారతంబు వ్రాసి పేరుగాంచినావు
పార్వతి పుత్రుడివైన నిన్ను ప్రస్తుతి సేతును
వేడెద నిను మదిలో వేగ రావయా
|శ్రీ గణనాయకా|
లంకాధీశుని గర్వమణచినావు
అమరులకే ఆత్మలింగమిచ్చినావు
ధరణిలో కొత్తపల్లి దాసుడి నివాసమైన
కోరెద నిను మదిలో కరుణ చూడవా
|శ్రీ గణనాయకా|