గానం: రామాంజనేయులు (అయ్యవారు)
బృందగానం: స్వాతి, భారతి, పావని, షాహింతాజ్ (పదవ తరగతి)
డప్పు: పోతలయ్య
భరతుడా నా చిన్ని తమ్ముడ
క్షేమమా తలి దండ్రులు?
గురువు విశ్వామిత్రులు
కుశలమా పురి జనులు?
అన్నవిను మన కన్న తండ్రి
మొన్ననే చనిపోయెను
మనములేని సమయమందున
తండ్రి మరణము చెందెను
తమ్ముడా భరతయ్య మనము
ఉండి ఏమి ఫలమురా?
ముని కుమారుని తల్లిదండ్రులు
ముందు పెట్టిన శాపము
అడవికొచ్చుట ఏమి నేరము
అన్న నాతో తెలుపుమా?
ఏమి వేడుకలంటు వస్తివి
విభుని భూముల ఎదుటకు?
తమ్ముడా భరతయ్య నాకిది
తల్లిదండ్రుల ఆజ్ఞరా
పదిలముగ పదునాలుగేండ్లు
ఉండి మరల వస్తుము
పాదుకా పట్టాభిషేకము
నీకు ఇస్తిని తమ్ముడా
ధర్మమును విడనాడకుండా
రాజ్యమేలుము తమ్ముడా
అన్న నిన్నెడబాసి నేన-
యోధ్యపురము నందున
పదిలముగ పదునాల్గు నిముషము-
లేను నచట నుండను
తమ్ముడా భరతయ్య నీవిది
తప్పుగా భావించకు
కన్నతల్లిని కష్టపెట్టకు
కారణంబేమున్నది?
కారణంబేమున్నది కైకమ్మ
ముఖమెటు చూస్తును?