అయ్యయ్యో నా మరది అయ్యో లక్ష్మణా అడవిలో మీ అన్నకు అతి భారమాయే బంగారు మాయలేడి అది ఒక్కటయ్యా మన పర్ణశాలకు ఇటు వచ్చెనయ్యా దాన్ని చూసినంతనె నే కోరగాను విల్లునంబులు బూని తా బోయెనంట హా లక్ష్మణ హా సీతా అనుచు మీ అన్న తలబోవుచున్నాడు మరది లక్ష్మణ గండభేరుండడవి పులులు సింహాలు అడవిలో మీ అన్నకు అతి భారమాయె అడవిలో మీ అన్నకు అతిభారమైతే యుగములేకుండాను జగములే పొంగు రాజ్యమతడు కోరకున్నను నీవు కోరగాను ఇదినీకు న్యాయమా మరది లక్ష్మణా ఏ యుగమందున ఏ జన్మమందు ఎవరీ సతీపతుల నెడబాపియుండ్రి?