ఈ పాట పల్లవిలో ’రామరాజ్యమైన’ అన్న పదం జనపదాల్లో భాగమైంది, అసంబద్ధంగా ఉన్నప్పటికీ. బాపు గారు తీసిన సినిమాలో దీన్ని ’తామరస నయన’ అన్నారు అర్ధవంతంగా. కానీ మీరు దీన్ని మీకిష్టమైనట్లు పాడుకోవచ్చు! ఇక నాలుగో చరణంలో ’జోకొట్టి..’ కాక మరేదైనా ఉండి, గతించిందేమో అనిపిస్తుంది.
రామాలాలీ మేఘ శ్యామా లాలీ రామా
రామరాజ్యమైన దశరథ తనయాలాలీ
ఎంత ఎత్తు ఎదిగినావో ఏమి చేయుదుమో రామా
అందరి కన్నుల ముందర నీవు ముద్దుగ తిరిగేవో రామా
|రామాలాలీ|
అయోధ్య నగరమంతా అలంకరించేమో రామా
నీవు నడిచే బాటల్లోన మల్లెలు చల్లేమో రామా
|రామాలాలీ|
అడ్డమైన ఆటలు ఆడి అలసిపోతివో రామా
జో కొట్టి జోలలు పాడి నిద్దురపుచ్చేమో రామా
|రామాలాలీ|
బంగారు పట్టు శాలువ పైన కప్పేమో రామా
జోకొట్టి జోలలుపాడి నిద్దురపుచ్చేమో రామా
|రామాలాలీ|