నామనోహర రామచంద్రా నాదుకోర్కెను తీర్చుమా పర్ణశాలకు వచ్చెను బంగారు లేడిని చూడుమా సుందరంగా లేడి కన్నులు చుక్కలు కాబోలును చెవులు శృంగారమ్ములు దాని కొమ్ములే విలునమ్ములు |నా మనోహర| పదిలముగ బంగారులేడిని పట్టితెమ్ము మనోహరా చిక్కకుండిన దాని చర్మము చీల్చితెమ్ము మనోహరా |నా మనోహర| అదిగొ చూడుము ప్రాణనాధ బెదరకను తానున్నది పరుగులెత్తుతు పర్ణశాల చుట్టు తిరుగుతున్నది పాలుపోసి పెంచుకుందు పసిబిడ్డవోలెను అడవులకు మీరు పోయినపుడాటలాడు కుందును |నా మనోహర|