పాడరా ఓ తెలుగువాడా!
పాడరా ఓ కలిమిరేడా!
పాడరా మన తెలుగు దేశపు భవ్య చరితల దివ్య గీతము
పాడరా, పాడరా, పాడరా!

యుగయుగంబులనుండి బంగరు గంగ నిచ్చెడు గౌతమీనది
కోహినూరును కురుల సందున ముడిచి కులికిన కృష్ణవేణి
యుగయుగంబులనుండి బంగరు గంగ నిచ్చెడు గౌతమీనది
కోహినూరును కురుల సందున ముడిచి కులికిన కృష్ణవేణి
హొయలుగా రతనాల సీమలో ఓలలాడిన తుంగ భద్ర
సొగసు గూర్చెను తెలుగు తల్లికి
సుఖము గూర్చెను తెలుగువారికి

||పాడరా||

కదనరంగమునందు మెరసిన కాకతీయుల ఖడ్గ తేజము
చెదర శత్రువు నెదిరి పోరిన వనిత రుద్రమ యుద్ద పటిమ
కదనరంగమునందు మెరసిన కాకతీయుల ఖడ్గ తేజము
చెదర శత్రువు నెదిరి పొరిన వనిత రుద్రమ యుద్ధ పటిమ
కొదమ సింగము పొదిగి నురికిన బాల చంద్రుని బాహు దర్పం
పొంగ జేయును మేనురక్తం ఉప్పొంగ జేయును నీదు హృదయం

||పాడరా||

తెలుగు పలుకుల తేనెలొలుకును తిక్కనార్యుని కవితలోనా
రాళ్లు కరుగును త్యాగరాయని రాగసుధలో మునిగె తెలుగు
తెలుగు పలుకుల తేనెలొలుకును తిక్కనార్యుని కవితలోనా
రాళ్లు కరుగును త్యాగరాయుని రాగసుధలో మునిగె తెలుగు
సొంపు గూర్చెను తెలుగు తల్లికి హంపి నగరపు శిల్ప సంపద
భరతనాట్యపు భంగిమలలో పల్లవించెను తెలుగు పరువము

||పాడరా||

తెలుగు జాతికి నూత్న సంస్కృతి తీర్చి దిద్దిన కందుకూరి
తెలుగు భాషను ప్రజల భాషగ చేయగోరిన పిడుగు గిడుగు
తెలుగుజాతికి నూత్న సంస్కృతి తీర్చి దిద్దిన కందుకూరి
తెలుగు భాషను ప్రజల భాషగ చేయగోరిన పిడుగు గిడుగు
దేశమంటే మనుజులేనని తెలియ జెప్పిన అప్పరాయుడు
తెలుగు తల్లి నోము పంటలై తేజరిల్లిన దివ్య తారలు

||పాడరా||

కలవు గనులగు నదులు జగముల పసిడి పాతర మనదు దేశం
సిరియు సంపద వెల్లి విరిసిన స్వర్గ తుల్యము చేసుకొందము
కలవు గనులగు నదులు జగముల పసిడి పాతర మనదు దేశం
సిరియు సంపద వెల్లి విరిసిన స్వర్గ తుల్యము చేసుకొందము
ఆరుకోట్ల తెలుగు బిడ్డల ముక్త కంఠము లొక్కపెట్టున
జయము జయమో తెలుగు తల్లని
విజయగీతికలాలపించగ

||"పాడరా"||

పాటలు వినడానికి Adobe Flash Player తెచ్చుకోండి.
Download this song