నీలి నీలి కొండమీద
చందమామ తొంగిచూసె
నిన్ను నన్ను పిలిచింది సైగ చేసి
ఓమామా
నిన్ను నన్ను పిలిచింది సైగ చేసి
పచ్చా పచ్చా చేనుల్లో పలకరించుకుంటూ
పంటాకోసే గలగల పాటలు వినుకుంటూ పోతే
ఎండలాంటి వెన్నెల్లో గుండె గుండె ఊసుల్లో
మనసుల్లో కథలేవో మళ్ళీ మళ్ళీ చెప్పుకోమని
మనసుల్లో కథలేవో మళ్ళీ మళ్ళీ చెప్పుకోమని
నిన్నూ నన్నూ పిలిచింది సైగచేసి
ఓమామా
నిన్ను నన్ను పిలిచింది సైగ చేసి ||నీలి నీలి||
డొంకదారుల్లోన నడుచుకుంటూ
ఓ మామా
పిల్లలందర్నీ కూడబెట్టుకుంటూ
పనీపాట పక్కానెట్టి చద్ది బువ్వ చేతబట్టి
పలకా బలపాలాతో బడికీ రారమ్మంటూ
నిన్నూ నన్నూ పిలిచింది సైగచేసి
ఓమామా
నిన్ను నన్ను పిలిచింది సైగ చేసి ||నీలి నీలి||