కోయిలమ్మలతో పిల్లలకు పోటీ పెడితే ఎలా ఉంటుంది? ఇలా ముగుస్తుందేమో అది! వినండి మరి!
గానం: రాశి బృందం, మూడో తరగతి, ప్రకృతి బడి, చెన్నేకొత్తపల్లి
కోయిలమ్మ గొంతెత్తి నువ్వు నువ్వు తియ్యగా పాడుతావు కుహుఁ కుహుఁ కుహుఁ కుహుఁ వసంత కాలం వచ్చిందంటే నువ్వు నువ్వు పసందుగా పాడుతావు కుహుఁ కుహుఁ కుహుఁ కుహుఁ చెట్టు చేమ చిగురేస్తే నువ్వు నువ్వు చిగురు మేసి పాడుతావు కుహుఁ కుహుఁ కుహుఁ కుహుఁ ఇంతింత పాపలం మేము నువ్వు తియ్యగా పాడుతాము కుహుఁ కుహుఁ కుహుఁ కుహుఁ
నాకు కూహూ కూహూ కోయిలమ్మ పాట చాలా బాగా ఉంది. పిల్లలు బృందంగా బాగా పాడారు. ఇంకా గోపాల్, త్రివేణి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ సెంటర్ వారు, రామాంజనేయులు చెప్పిన జోక్స్ బాగా నచ్చాయి. టి.రోహిణి, పదవతరగతి, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, శాలిబండ, హైదరాబాదు.
వ్రాసిన వారు: rohini — August 13, 2008