తేనెటీగా! తేనెటీగా!
తేనె ఇస్తావా?
పువ్వునడుగు-పువ్వునడుగు
పుడిశెడిస్తుంది
పువ్వూ, పువ్వూ! తేనె ఒక్క
పుడిశెడిస్తావా?
తీగనడుగు- తీగనడుగు
దోసెడిస్తుంది
తీగా, తీగా! తేనె ఒక్క
దోసెడిస్తావా?
మంచెనడుగు- మంచెనడుగు
మానెడిస్తుంది
మంచే, మంచే! తేనె ఒక్క
మానెడిస్తావా?
కంచెనడుగు-కంచెనడుగు
కడివెడిస్తుంది
కంచే, కంచే! తేనె ఒక్క
కడివెడిస్తావా?
కాపునడుగు- కాపునడుగు
పీపాడిస్తాడు
కాపూ, కాపూ! తేనె ఒక్క
పీపాడిస్తావా?
పీపాలేదు- పాపాలేదు
ఫో! ఫో! ఫో!!!!