అదిగదిగో ఆకసాన ఎగురుతోంది రాజసాన
అదిగదిగో ఆకసాన ఎగురుతోంది రాజసాన
జాతిగౌరవాన్ని చాటు మువ్వన్నెల జండా
భరతమాత కీర్తిచాటు ముజ్జగాలనిండ
భరతమాత కీర్తిచాటు ముజ్జగాలనిండ

జైజవాను జైకిసాను చేయి చేయి కలిపి
సైమన్ గో బ్యాక్ అంటూ తెల్ల దొరల నిలిపి
దండి యాత్ర చేసి శాంతి దండయాత్ర చేసి
అండగనిలిచి, గెలిచిన త్రివర్ణాల ఆకాశాన ||అదిగదిగో||

ప్రతి పౌరుడు వీరునిగా అడుగు ముందుకేసి
ప్రతి పౌరుడు వీరునిగా అడుగు ముందుకేసి
జాతి పిత గాంధీజీ శాంతి బాట నడిచి
జాతి పిత గాంధీజీ శాంతి బాట నడిచి
ముందుకు గుండెను ఇచ్చి నిండుప్రాణములిచ్చి
సత్య మేవ జయతే అని తెచ్చిన త్రివర్ణాల ఆకసాన ||అదిగదిగో||

పాటలు వినడానికి Adobe Flash Player తెచ్చుకోండి.
Download this song