పూలలోంచి తేనెను తాగుతున్న ఈ పిట్టను చూశారా? దీని పేరు 'హనీబర్డ్' -తేనె పిట్ట అన్నమాట. పిచ్చుక కంటే చిట్టిగా నాలుగంగుళాల పరిమాణంలో ఉండే ఈ పిట్టకు పూలలోంచి తేనెను పీల్చుకునేందుకు అనువైన, సన్నని-పొడవాటి ముక్కు ఉంటుంది. ఇవి మన దేశంతో సహా పూలున్న అనేక దేశాల్లో సంతోషంగా ఎగురుతూ కనిపిస్తాయి.
మరి ఇక్కడ, ఈ తేనెపిట్టకు ఏమైంది? బాగా ఆకలైంది.
అప్పుడు అది ఏం చేసింది? ఇట్లా తేనె త్రాగేందుకని తోటకు వెళ్ళింది.
అక్కడ దానికి..... ఏమి ఎదురైంది, అప్పుడు ఏమైంది- ఈ సంగతులన్నీ ఇప్పుడిక మీరు ఊహించండి. ఆ సంగతులేవో మాకు రాసి పంపితే, బాగున్న కథల్ని ఫిబ్రవరి మాసపు కొత్తపల్లిలో ప్రచురిస్తాం. మొదలుపెట్టండి మరి!