సైన్సు సంగతులు
1. సముద్రపు సగటులోతు 3600మీ. అంటే 3.6 కిలోమీటర్లన్నమాట!
2. లోతైన సముద్రపు ప్రాంతంలో ఎవరెస్టు పర్వతాన్ని పూర్తిగా ముంచేయవచ్చు!
3. సూర్యకాంతి సముద్రంలో 73మీ లోతు వరకు మాత్రమే చొచ్చుకుపోగలదు!
4. 'ప్లూటో' గ్రహ విస్తీర్ణం 'రష్యా' విస్తీర్ణం కంటే తక్కువ!
సేకరణ: శ్రీ వి వి యస్ మూర్తిగారు, చొదిమళ్ళ, ప.గో.జిల్లా

తారంగం తారంగం
తారంగం తారంగం
తాండవ కృష్ణ తారంగం
వేణు వినోదా తారంగం
వెన్నల దొంగ తారంగం
చిన్ని కృష్ణా తారంగం
చిన్నారి కృష్ణా తారంగం
సేకరణ: M. ఐశ్వర్య, ఐదవతరగతి, M.P.P. స్కూల్, దాసరి స్ట్రీట్, గుత్తి, అనంతపురం జిల్లా.

అమ్మ
లోకంలో అమ్మ ప్రేమ చాలా విలువైనది.
అది అందరికీ దొరకని ఒక వజ్రం-
వెలకట్టలేని ఒక నాణెం
చేయలేని ఒక యుద్ధం (?)
అపస్వరం లేని రాగం
మరువలేని ఓ జ్ఞాపకం.
రచన : M. ప్రణీత, పదవతరగతి, తేజ విద్యాలయ, కోదాడ.

తెలివైన నాయకుడు!
విలేఖరి: అయ్యా! మీరు ఇంత తక్కువలో ఇల్లు ఎలా కట్టుకోగలిగారు?
రాజకీయ నేత: నాకు రాళ్ల ఖర్చు, ఇటికల ఖర్చు లేదు కాబట్టి.
విలేఖరి: అదెలాగ?
రాజకీయ నేత: మొన్న జరిగిన ఎలక్షన్లలో జనాలు నామీద విసిన రాళ్ళు ఇటుకలు తీసి పెట్టాను. వాటితోటే ఇప్పుడు ఇల్లు కట్టుకుంటున్నాను మరి!
ముందుచూపు!
టీచర్: రవీ, సైన్సు వేగంగా అభివృద్ధి చెందుతున్నది కదా, 2020లో ప్రధాన సమాచారం ఏమై ఉండచ్చు, చెప్పు?!
రవి: అంగారకుడి మీదికి పంపిన రాకెట్టు ఇవాళ్ళ ఉదయం హైజాక్‌కి గురైంది..

నాన్న తెలివి!
చింటూ: నాన్నా అందర్నీ నిద్రలేపేది సూర్యుడేనట కద నాన్నా!
నాన్న: అవునురా.
చింటూ: మరి సూర్యుడిని ఎవరు నిద్రలేపుతారు నాన్నా?
నాన్న(కొంచెం అనుమానంగా): కోడి కూత అయి ఉండచ్చురా, మీ టీచర్‌ని అడుగు.

ఆధునిక జూ!
రవి: నాన్నా, కటకటాలు అంటే ఏంటి నాన్నా?
నాన్న: కటకటాలు అంటే ఇనుముతో చేసిన గ్రిల్‌రా, జూలో బోను లాగా అన్నమాట.
రవి: అన్నవాళ్ల బడిలో కూడా కటకటాలుంటాయి కదు నాన్నా?
నాన్న: ఆఁ!!

సద్వినియోగం!
సుబ్బారావు: ఏం వెంగళప్పా, మాటి మాటికీ వాచీకేసి చూసుకుంటున్నావు? వేరే పనేం లేనట్లు, అన్ని సార్లు వాచీకేసే చూస్తూండటం సమయం వృధా కద?!
వెంగళప్ప: అదేమరి, సమయం ఎంత వృధా అవుతున్నదో చూస్తున్నాను వాచీలో.

బద్ధకిస్టు!
టీచర్: సురేష్, అకస్మాత్తుగా విద్యుత్‌శక్తి లేని పరిస్థితి ఎదురైందనుకో, అప్పుడు నువ్వేం చేస్తావు?
సురేష్: అప్పుడు నేను నా మెదడును ఉపయోగిస్తాను టీచర్!
టీచర్: అదేమి? ఇప్పుడు నీ మెదడును వాడట్లేదా?
సురేష్: ఎందుకు టీచర్, ఇప్పుడు కంప్యూటర్లు పని చేస్తాయి కదా!

పొడిగింపు!
టీచర్: ఏ వస్తువైనా సరే, వేడి తగిలితే వ్యాకోచిస్తుంది. అర్థమైందా?
టింకూ: అందుకనేనా టీచర్, ఎండాకాలంలో సెలవలు పొడిగిస్తుంటారు?

ఫోను భాష!
లెక్కల మాస్టారుగా పని చేస్తున్నాడు వెంగళప్ప. పిల్లలతో చెబుతున్నాడు:
వెంగళప్ప: నేను లెక్కల సారుగా దేన్నైనా భరిస్తాను గానీ రాంగ్ నెంబరును మాత్రం భరించలేను.

శిక్షణలో ఉన్నాడు!
చిట్టి వెంగళప్ప మెడకు యల్ బోర్డు ఎందుకు తగిలించుకున్నాడు?
అక్షరాలు నేర్చుకుంటున్నాడు కాబట్టి!

తల తిరిగింది!
మోహన్: అయ్యా ఇది ఎన్ని నక్షత్రాల హోటల్?!
మ్యానేజర్: సార్! ఇది మూడు నక్షత్రాల హోటల్ సార్!
మోహన్: మరి మీ బిల్లు చూసాక నాకు ఐదు నక్షత్రాలెందుకు కనబడ్డాయి?

మా నాయనే!
కిట్టు: అమ్మా, నాకో గులాబీ మొక్కా, ఒక జామ మొక్కా కావాలే!
అమ్మ: ఎందుకు నాన్నా?
కిట్టు: మరేఁ ! ఎన్ని సార్లు అడిగినా నువ్వు గులాబ్‌జాంలు చేసిపెట్టట్లేదు మరి!

కాలాన్ని ఆపిన మనిషి!
ప్రొఫెసర్: మనిషి ఏమైనా చేయగలడు కానీ‌ కాలాన్ని మటుకు ఆపలేడు..
వెంగళప్ప (అరిచాడు): నేను ఆపేశాను!
ప్రొఫెసర్: ఎలాగ, ఏం చేశావు?
వెంగళప్ప: ఇదిగో, నా వాచీలోంచి బ్యాటరీ తీసేశాను!

కడుపు మంట!
విలేఖరి: ఈమధ్య పెట్రోలు కంటే బాగా మండేవి వచ్చేశాయి..
శాస్త్రవేత్త: అవునా? ఏమిటవి?
విలేఖరి: ధరలు!

ఆధునిక గాంధీ!
శిష్యుడు: స్వామీ! భక్త జనానికి మీరిచ్చే సందేశం..?
గురూజీ: FM వినకు, TV చూడకు, సెల్‌ఫోనులో మాట్లాడకు

భిన్నాల లెక్క!
డాక్టరు: మీకు బిపి 160/80 ఉంది..
లెక్కల అయ్యవారు: అంటే రెండు ఉన్నట్లా సర్?!

పంట పండింది!
విలేఖరి: పంటి డాక్టరుగా మీది 'వారసత్వం' అన్నారు. మరి మీ నాన్నగారు, తాతగారు కూడా పంటి డాక్టర్లేనా?
పంటి డాక్టరు: కాదండి. మా నాన్నగారు పండ్ల వ్యాపారం చేసేవారు. మా తాతగారు పండ్లు పండించేవారు.

భయం!
టీచర్: సుజాతా! నీకు స్టేజ్ ఫియర్ ఉందామ్మా?!
సుజాత: ఉన్నది టీచర్! ఎప్పుడు బస్సెక్కినా, నేను దిగాల్సిన స్టేజీ ఎక్కడ దాటిపోతానో అని భయపడుతూనే ఉంటాను!

శిక్ష!
బాబు: నాన్నా! నువ్వు ఎన్నేళ్ళు చదువుకున్నావు నాన్నా?
నాన్న: నేను పదిహేడేళ్ళు చదువుకున్నాను బాబూ
బాబు: మరి అమ్మ ఎన్నేళ్ళు చదువుకున్నది నాన్నా
నాన్న: అమ్మ పదిహేనేళ్ళు చదువుకున్నదిరా, ఎందుకివన్నీ ఇప్పుడు?
బాబు: మరి నేను ఇంకా ఎన్నేళ్ళు ఇలా చదువుకోవాలోనని!

సూక్ష్మ దృష్టి!
డ్రాయింగ్ టీచర్: ఏమ్మా, బంటీ! చక్కని బొమ్మ ఏదైనా వేసి ఇమ్మంటే ఖాళీ పేపరు ఇచ్చావు?
బంటీ: లేదు సార్, నేను చక్కని బొమ్మ వేసే ఇచ్చాను.
టీచర్ (ఖాళీ కాగితం చూపిస్తూ): ఏది, బొమ్మ?!
బంటీ: నేను వేసింది సూక్ష్మ జీవి సార్, కంటికి అట్లా కనిపించదు!

పందిరి వాసం!
వాస్తు సిద్ధాంతి : అమ్మా, మీ పరిస్థితి ఇలా అవ్వటానికి కారణం ఏంటి?
సుభద్రమ్మ: మీరు చెప్పినట్లు చెయ్యటమే!
వాస్తు సిద్ధాంతి: ఏం చెయ్యమన్నానమ్మా, నేను?
సుభద్రమ్మ: సుఖంగా కూర్చొని ఉంటే వచ్చి, ఇల్లు పీకి పందిరెయ్యమన్నారుగా, నేను అదే చేశాను మరి!

చిన్న నెల
టీచర్: అన్నింటిలోకి చిన్న నెల ఏది?
చింటు: 'మే' సార్!
టీచర్: అదెలాగా?
చింటు: 'మే' నెలలో ఒకే అక్షరం ఉంది సార్!

మీకు తెలుసా? మార్కులకు, తెలివి తేటలకు ఏమంత సంబంధం లేదు.
గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ ఇంటర్మీడియట్లో తప్పాడు!
ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త ఐన్‌స్టీన్‌కి పాలిటెక్నిక్ ఎంట్రన్సు బాగా రాయక సీటు దొరకలేదు!