1. "సాక్షులున్నారా?" అని జడ్జిగారు అడిగితే తెలివైన వాడు ఏమంటాడు?
జవాబు: 'నా మనసే సాక్షి' అంటాడు.

2. లాటరీ టికెట్లు అమ్ముకునే వాడితో పిసినారి ఏమంటాడు?
జవాబు: లాటరీ వచ్చాక డబ్బులిస్తాను, ఇప్పుడు టికెట్ ఇమ్మంటాడు.

3. వంటరాని అమ్మాయి ఏమని పట్టు పట్టింది?
జవాబు: 'ఫైవ్‌స్టార్ హోటల్ చెఫ్‌నే పెళ్ళి చేసుకుంటాను' అని!

4. మంచి వడ్డీ వ్యాపారి కొడుకు పేరు ఏంటి, మనవడి పేరు ఏంటి?
జవాబు: కొడుకేమో "అసలు"- మరి, మనవడేమో "వడ్డీ"!

5. కన్యాకుమారిలో అమ్మాయిల సంఖ్య ఎంత?
జవాబు: రెండే! (ఒకరు 'కన్య' ; మరొకరు 'కుమారి'!)

6. అజ్ఞానం అంటే?
జవాబు: 'అన్నీ తెలుసు' అనుకోవటం.

7. తెలివైన పూల వ్యాపారి స్లోగన్ ఏంటి?
జవాబు: "పువ్వులు కొంటే సువాసన ఉచితం”!