దానిమ్మ పండు
నిన్ను చూడగానే
నోరూరు చుండు
అబ్బబ్బ పులుపు
తిననే తిననూ!
నీకు కావాలా?
నీకు కావాలా?
ఎవ్వరికీ వద్దా
పడేస్తున్నాను - పడేస్తున్నాను
పడేసాను!!!