అయ్యా, నేను నిన్న మా నాన్నగారి పాత 'తొక్కేద్విచక్రవాహనం' పైన పాఠశాలకి వెళ్లాను. అయితే తాళం వేయకుండానే పాఠశాల ముందు పెట్టి గబగబా తరగతి గది లోనికి వెళ్లాను. ఎందుకంటే అప్పటికే చాలా ఆలస్యం అయింది. తరువాత భోజనవిరామ సమయంలో బయటికి వచ్చినప్పుడు కూడా అది అక్కడే ఉందని గమనించాను నేను.

అయితే తరగతులు ముగించుకొని బయటికి వచ్చి చూసుకుంటే అది మాయం అయిపోయింది! నేను వెంటనే అటు, ఇటు చూస్తూ అంతటా వెతికాను- కానీ నా తొక్కేద్విచక్రవాహనం కనబడలేదు. పరుగెత్తుకు వెళ్లి అక్కడ కాపలాదారు అయిన నరేంద్రన్నకి చెప్పాను- కానీ తొక్కేద్విచక్రవాహనం మీద ఎవరూ వెళ్లగా చూడలేదని చెప్పాడు అతడు. మీరు కొంచెం వెతికి- పెట్టండి.

నా తొక్కేద్విచక్ర వాహనం ఎర్రరంగులో ఉంటుంది. చాలా పురాతన కాలంది. దాని ముందు ఉండే దీపం పగిలిపోయింది. నా తొక్కే ద్విచక్రవాహనాన్ని దొంగలించడానికి అవకాశం ఉన్న వాళ్ళ పేర్లు మీకు చెబుతాను- మీరు పరిశోధించటానికి వీలుగా ఉంటుంది. వాళ్లు నరేంద్రన్న, లక్ష్మీ అక్క, జయంత్ , మైత్రేష్ , కార్తీక్, నందకిశోర్, యువరాజ్, విషాల్, వేద ఇంకా సమీర - ఎందుకంటే వీళ్ళందరూ దానిమీద ముందునుండే కన్నేసి ఉంచారు. దయచేసి ప్రయత్నం చేయండి. నా తొక్కేద్విచక్ర వాహనాన్ని నాకు ఇప్పించండి.

విధేయురాలు.
ప్ర వీణ,
6వతరగతి, రిషివ్యాలీ బడి,
మదనపల్లి, చిత్తూరుజిల్లా.