1. టి.వి. యాంకర్‌కు పెళ్ళిచూపుల్లో 'నీ పేరేంటమ్మా' అని కాబోయే అత్తగారు అడిగితే......!?
జవాబు: "ఈ ప్రశ్నకి జవాబు- బ్రేక్ తర్వాత!" అంటుంది యాంకరమ్మ!
2. ప్రభుత్వం ఉలిక్కిపడేదెప్పుడు!?
జవాబు: "రిటైరయ్యాక లంచాలు రావు; కాబట్టి పెన్షన్ పెంచాలి" అని ఉద్యోగులు నిరాహారదీక్ష చేసినప్పుడు.
3. ఆర్ టిసి డ్రయివరు పైలట్ అయితే ఏమంటాడు!?
జవాబు: 'సీట్లులేవు స్డాండింగ్ అయితే ఎక్కండి ' అంటాడు.
4. విద్యారంగం గురించి తెలిసిన విలేఖరి విస్తుపోయేదెప్పుడు!?
జవాబు: “విద్యార్థుల వద్దకే ఉపాధ్యాయులు" పథకం గురించి ఆలోచిస్తున్నా అని ముఖ్యమంత్రి అన్నప్పుడు.
5.జడ్జిగారు అవాక్కయ్యేదెప్పుడు?
జవాబు: “గిన్నీస్ బుక్‌లో స్థానం కోసం విడాకులు తీసుకుంటున్నాం" అని వృద్ధ దంపతులు వివరించినప్పుడు.
6.'విదేశీ వ్యామోహం' అంటే..!?
జవాబు: ఇండియాలో వున్నప్పుడు చైనీస్ రెస్టారెంట్‌కు వెళ్ళటం , చైనా వెళ్ళినప్పుడు ఇండియన్ రెస్టారెంట్‌కు వెళ్ళటం.