చిట్టి చిలకమ్మ
చిట్టిచిలకమ్మ
అమ్మకొట్టిందా
తోటకెళ్ళావా?
పండు తెచ్చావా?
గూట్లో పెట్టావా?
గుటుక్కు మింగావా!
చుక్ చుక్ రైలు
చుక్ చుక్ రైలు వస్తోంది
దూరం దూరం జరగండి
ఆగినంక ఎక్కండి
జోజో పాపా ఏడవకు
లడ్డు మిఠాయి తినిపిస్తా
చల్లని పాలు తాపిస్తా
చక్కని సినిమా చూపిస్తా.
ఊష్ కాకి
ఊష్ కాకి!
మా చేనులో వాలద్దు
మా కంకి కొరకద్దు.
మా చేనులో వాలద్దు
మా నాన్న పేదోడు
మా అమ్మ రాకాసి
నేనేమో గ్లూకోసు!
దుబ్బోడి పాట
దుబ్బోడమ్మా దుబ్బోడు
దుబ్బ బిస్కెటు తిన్నాడు
ఇంకా కావాలన్నాడు
అమ్మకు కోపం వచ్చింది
మూడు గుద్దులు గుద్దింది
శాంతక్క పాట
శాంతక్కా , బావేడి?
బజారుకు వెళ్ళాడు
ఏమి తెచ్చాడు?
పప్పులు తెచ్చాడు
పొప్పులు ఏవీ?
గుడ్డోడు తిన్నాడు
ఎట్లా తిన్నాడు?
కాల్చుకొని తిన్నాడు
ఏమి కాలింది?
మీసం కాలింది.