1. ఫైర్ఆఫీసర్ 'ఫైర్' అయ్యేదెప్పుడు!?

కడుపు 'మంట'గా వుందని ఓ వ్యక్తి ఫోన్ చేసినప్పుడు!!

2. మిమిక్రీ ఆర్టిస్ట్ ఇంట్లోకి దొంగ ప్రవేశిస్తే....!?

కుక్కలా అరుస్తాడు!!

3. దేవుళ్ళు కొండలమీదే వెలుస్తారెందుకు!?

స్వచ్ఛమైన ఆక్సిజన్ కోసం!!

4. "సౌండ్"స్లీప్ అంటే......!?

గురకనిద్ర!!

5. మంత్రిగారు ముగ్ధుడయ్యేదెప్పుడు!?

మనవడికి కథచెప్తుంటే వాడు "ఊ" కొట్టకుండా "జై" కొడుతున్నప్పుడు!!

6. వెటర్నరీ డాక్టరు ఇంటిగేటు మీదున్న బోర్డు మీద ఏమనిరాసి వుంది!?

"రేబిస్ వ్యాధి కలిగించే కుక్క వున్నది జాగ్రత్త"

7. "పూలమ్మిన చోట కట్టెలమ్మటం" సామెత పాతదైపోయింది. మరి కొత్త సామెత ఏంటి? "

చెరకు పండించిన పొలంలో వంట చెరకు పండించటం!!"

8. అద్భుతమైన ఆఫర్!?

"తాళంకప్ప కొంటే తాళంచెవి ఉచితం!!

9. కోపంగా ఉన్న ఇల్లాలు ఏంచేస్తుంది?!

పుట్టింటి వాళ్ళొచ్చినప్పుడు టి.వి, అత్తింటి వాళ్ళు వచ్చినప్పుడు రేడియో పెడుతుంది!!

10. చిట్టిపిల్లల తల్లిదండ్రులకు ముందుచూపుతో మీరిచ్చే సందేశం?

వాళ్ళు బడికి వెళ్ళే ముందు హాపీ,
వెళ్ళటం మొదలు పెట్టిన తర్వాత బిపి!!