 
   రామూ రామూ! పెద్దయినంక ఏమి చేస్తావు? 
సమతా రాజ్యం జనతా రాజ్యం సారధినౌతాను. 
   
భీమా భీమా! పెద్దయినంక ఏమి చేస్తావు?
దేశ రక్షణ చేసే సిపాయినౌతాను. 
   
సోమూ సోమూ పెద్దయినంక ఏమి చేస్తావు?
భూమి దున్ని పండించేటి రైతునౌతాను. 
   
ప్రేమా ప్రేమా! పెద్దయినంక ఏమి చేస్తావు?
విజ్ఞానాన్ని వెలిగించే గురువునౌతాను.


