పాలపిట్ట రావే
రచన: శ్రీ బాలాంత్రపు రజనీకాంత రావుగారు, విశాఖపట్నం.
సౌజన్యం: ఫోరం ఫర్ ఛైల్డ్ సెంటర్డ్ ఎజుకేషన్, విజయవాడ.
పాలపిట్ట రావే
పలుకాడి పోవే (2)
చిన్ని రెక్క చేతులు మడిచి
సన్న ఎలుగుల మైమరచి
ఆకాశాన తేలిపోతూ
అల్లనల్ల ఎగిరిరావె! "పాలపిట్ట రావే"
తంతి తీగ పైన నిలచి
వింతలేమి చెబుతావే?
రైలు బండి గూటిలోన
వాలినేను చూచుచుండ "పాలపిట్ట రావే"
చిన్ని తోక కదలియాడ
చిన్ని గొంతు పాట పాడ
పాట పైకి రాక మునుపే
దాటు వేసి ఎగురుతావె! "పాలపి
-
బాగుంది.
వ్రాసిన వారు:
ప్రియ
— september 30, 2011
వ్యాఖ్యలు వారి సౌజన్యంతో