ఏదో ఛానల్!
టీచర్ : శ్రీకాంత్ 'ఇంగ్లీష్ ఛానల్ ' ఎక్కడుంది? శ్రీకాంత్ : ఏమో! టీచర్ ! మాటివీలో ఆ ఛానల్ రాదు .
చెప్పుడు మాట
టీచర్: రాము! దొంగతనం చేయటం తప్పని నీ అంతరాత్మ చెప్ప లేదా?! రాము: చెప్పింది టీచర్, కానీ చెప్పుడు మాటలు వినరాదని మీరే అన్నారు కదా, అని....
ఇంపాజిబుల్ ఈజ్ పాజిబుల్!
సుబ్బు: మామ్! నేను ఇవ్వాళ్ల 'ఇంపాజిబుల్ ' ను 'పాజిబుల్ ' ఎలా చేయాలో తెలుసుకున్నా. తల్లి: ఎలా? సుబ్బు : 'ఇంపాజిబుల్ ' లో మొదటి రెండు లెటర్లు తీస్తే సరి.
నిజంగా వెంగళప్పే!
వెంగ ళప్ప కొడుకు : మా నాన్న చాలా ధైర్యవంతుడు . పులి బోనులోకి వెళ్ళాడు ... రాము : అబ్బ! అవునా!? బయటికి వచ్చాక అందరూ భలే మెచ్చుకుని ఉంటారు! వెంగళప్ప కొడుకు: బయటకు వచ్చాడని నేను చెప్పలేదు.
అతి జాగ్రత్త!
చింటూ: ఎక్స్ ప్సెస్ ఎప్పుడొస్తుందండి? T.C: రెండింటికి. చింటూ : ప్యాసింజర్ ? T.C: మూడింటికి. చింటూ : మరి గూడ్స్? T.C: ఇంతకీ నువ్వు ఎటు వెళ్లాలి? చింటూ: రైలు పట్టాల అవతలకి !!
కొత్త రామాయణం!
టీచర్: సీతా, లక్ష్మణుడు వాళ్ల అన్న పేరు ఏంటో చెప్పమ్మా ? శ్వేత: ఆగండి టీచర్! అక్ష్మణుడిని అడిగివస్తాను ప్లీజ్!
జోడు కష్టాలు!
రాము: ఒరేయ్ నీకు ఒక చెవి కోసేస్తే ఏం జరుగుతుంది? రాజు:వినబడదు. రాము:మరి రెండు చెవులుకోసేస్తే?! రాజు:కనబడదు రాము:అదెలా?!? రాజు:రెండు చెవులూ కోసేశాక ఇక నా కళ్ల జోడు నిలబడదుకదా?!