దీపం... విజ్ఞాన చైతన్య రూపం(2)
శూన్యమైన - ఆకాశంలో- సూర్యుడె కాంతి దీపం!!(2)
మూఢుడైన- మానవునకు- విద్యే విజ్ఞాన దీపం(2)
విద్యే విజ్ఞాన దీపం
"దీపం..."

వేసవి ఎండల ఎండిన ఏటికి
మేఘమె ఆశా దీపం(2)
శిశిరాన మ్రోడైన తరువునకు
చిగురే చైతన్య దీపం(2)
చిగురే చైతన్య దీపం
"దీపం..."

కష్టము, సుఖము -కలసిన బ్రతుకున-
పాపలే ఆనంద దీపం!!(2)
మంచి, చెడులు సూచించు మనసే మనిషికి దివ్య దీపం(2)
మనిషికి దివ్య దీపం
"దీపం ...”

పాటలు వినడానికి Adobe Flash Player తెచ్చుకోండి.
Download this song