అంతా అందులోనే!
సన్ని: "అయాం గోయింగ్" అంటే అర్థం చెప్పరా?
బన్ని: నేను వెళుతున్నా!
సన్ని: ఆగరా, దీనికి సమాధానం చెప్పు?
అదే వెలుగు
సందీప్: ఏంట్రా కరెంట్ పోయినా ఇంట్లో దీపం పెట్టలేదేంటి?
ప్రశాంత్ : మా ఆవిడ చదువుకుంటోందిరా, అందుకని.
సందీప్: అయితే?
ప్రశాంత్: " ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు" అన్నారుకదా, ఇక వేరే దీపం ఎందుకు, దండగ?
చక్కని మార్గం
రాము: దోమలు విపరితంగా ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు.
రమేష్: ఓ పని చెయ్యి- ఇంటికి 'టు లెట్' అని బోర్డు పెట్టు. 'ఇల్లు ఖాళీగా ఉంది కదా' అనుకొని, దోమలు లోపలకి రావు.
పాపం పిసినారి!
చింటు: నాన్నా! పక్కింటి వాళ్ళు పిసినారులా?
తండ్రి: లేదే? ఎందుకు వచ్చిందిరా, నీకా అనుమానం?
చింటు: వాళ్లబ్బాయి పావలా మింగాడట. మరి ఆ మాత్రం దానికే వాళ్ళు అంతగా ఎందుకు ఏడుస్తున్నారు?
చక్కని జంట!
పెళ్ళి కూతురు తల్లి: మా అమ్మాయి ఒట్టి పుస్తకాల పురుగండీ.
పెళ్ళి కొడుకు తండ్రి: ఫర్వాలేదులేండి, మా అబ్బాయిది పురుగు మందుల వ్యాపారమేగా!
ఏమీ మిగల్లేదు
కొడుకు:నాన్నా ! ఈ రోజుతో నా చదువు పూర్తయింది. అన్ని రకాల కోర్సులూ పూర్తి చేశాను.
తండ్రి: నా ఆస్తి కూడా పూర్తయింది. అన్ని రకాల అప్పులూ చేశాను.
ఇదొక్కటే చాలు
షాపు యజమాని: మా స్వీట్ షాపులో పని చేయడానికి మీకున్న అర్హతలేంటి?
సుబ్బారావు: నాకు షుగర్ ఉంది సార్!
తెలివి!
మాస్టారు: సునీతా, ఎనిమిదిలో సగం ఎంత?
సునీతా: అడ్డంగా కోస్తే సున్నా, నిలువుగా కోస్తే మూడు సార్!
ఏం పని!?
బ్రహ్మాం: సడన్ గా భగవంతుడు ప్రత్యక్షమైతే నువ్వేం అడుగుతావు?
వెంగళప్ప: 'నాతో ఏం పనుండి ప్రత్యక్షమయ్యారు స్వామీ?' అని అడుగుతాను.
గుమ్మడికాయ దొంగ!
రవి: మాస్టారూ! భోజనం చేశారా?
మాస్టారు(చికాకుగా): నేనెందుకు చేస్తాను? మా ఆవిడ కదా, చేసేది?!
గాలి కబుర్లు
తండ్రి ; మీ కొత్త టీచర్ పాఠాలు ఎలా చెబుతున్నారు రా?.
కొడుకు: అన్నీ గాలి కబుర్లే నాన్నా!
తండ్రి: అదేంట్రా, పాపం అట్లా అంటావు?
కొడుకు: నిన్న ఆక్సిజన్ , మొన్న నైట్రోజన్.. ఇవాళ్ల హైడ్రోజన్! మరింకేమనాలి?