సేకరణ: యన్. సింహాచలం, యన్. శశి, టింబక్టు.
1. నల్లరాయి కింద నలుగురు దొంగలు. ఎవరు?
2. కీకీ పిట్ట - నేలకేసి కొట్ట. ఏంటది?
3. పిల్ల తిరుగుతుంది తల్లి తిరగదు. ఏంటది?
4. కూతురుకు కనుము ఉంటుంది. పిన్నమ్మకు కనుము ఉంటుంది. పిల్లకి కనుము ఉంటుంది. తల్లికి కనుము ఉండదు. ఏమిటా కథ?
5. ఒంటి కాలోడు- వర్డామెళ్ళినాడు. ఏంటది?
6. గది నిండా పప్పు- గదికితాళం. ఏంటది?

(జవాబులు: 1. ఎనుము 2. చీమిడి 3. తిరగలి (విసుర్రాయి) 4. సూది, దబ్బనం, గడారు (గడ్డపార) 5. పుట్ట గొడుగు 6. వంకాయ )