గజ్జెలు గజ్జెలు గలగల గజ్జెలు
చిన్నారి కాలికి బంగారు గజ్జెలు
మామ తెచ్చిన మా మంచి గజ్జెలు
పాపకు నచ్చిన మేలిమి గజ్జెలు
బుడి బుడి నడకలు పాపాయి నడువ
కాలి గజ్జెలుగల గల మ్రోగేను
అడుగు కదిపి నాట్యం చేయగ
వంతుగ గజ్జెలు తాళం వేసేను
తమ్ముడు చిలిపిగా పాపను చేరి
గజ్జెలు తనకు ఇమ్మనగా
పాప పరుగుతో అమ్మ ను చేరె
మురిసి గజ్జెలు గలగల లాడెను