1) రాము: రేయ్ సోమూ! 2 + 2 + 2 + 2 = 8 అయితే 4 + 4 = ఎంత అవుతుందిరా?

సోము: అబ్బ, సులభమైందేమో నువ్వు చెప్పి, కష్టమైనదాన్ని నన్ను అడుగుతావా రా!


2) సోము: ఒరేయ్ రామూ, చెప్పరా! మూలధనం అని దేన్ని అంటాము?

రాము: ఓసి ఆ మాత్రం తెలీదేంట్రా! ధనాన్ని బీరువాలోనుండి తీసి మూలలో పోస్తే అప్పుడు దాన్ని మూల ధనం అంటాం రా!


3) సోము: ఒరేయ్ రామూ, నీకు పాండవులు ఎవరో తెలుసా?

రాము: ఓ! ఎందుకు తెలీదు? తెలుసు.

సోము: మరి పాండవులను పంచ పాండవులని ఎందుకంటారో తెలుసా?

రాము: వాళ్లు పంచెలు కట్టుకొనే వారేమో అందుకనే అయ్యుంటుంది రా!


4) రాము : ఠాగూర్ గారి పూర్తి పేరు చెప్పు సోమూ!

సోము: భలే మంచి ప్రశ్నరా! జవాబు మెగాస్టార్ చిరంజీవి! ఏమంటావు?!


5) రాము: అన్నమయ్య ఏ శతాబ్దానికి చెందినవాడో చెప్పు నువ్వు..

సోము: ఆయన ఇరవయ్యో శతాబ్దికి చెందినవాడేకదా...

రాము: కాదు. ఆయన పదహారో శతాబ్దికి చెందినవాడు.

సోము: మరి నాగార్జున కనీసం ఇంకా ముసలాడైనా కాలేదేమిట్రా మరి?!


6) సోము: రేయ్ రామూ! భారతదేశానికీ, జర్మనీకీ మధ్య దూరమెంతుంటుందో చెప్పరా!

రాము: సరిగ్గా మా నాన్న జానెడుతో జానడంటే జానెడేరా. నిన్ననే మా ఇంట్లో అట్లాస్ మీద కొలిచి మరీ చూసాము.


7) రాము: పొదుపు చేయడంలో ఎవరు ముందుంటారో చెప్పు నువ్వు..

సోము: ఇంకెవరు? సినిమా వాళ్లు!

రాము: వాళ్లేనని అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నావు?

సోము: మరి వాళ్లే కదా బట్టల దగ్గరినుండీ చాలా పొదుపును పాటిస్తారు?!


8) రాము: ఒరేయ్ సోమూ ఇంతకీ నీ వయసెంతరా?

సోము: పన్నెండు.

రాము: పెళ్లయిందా?

సోము: లేదు.

రాము: మీ ఇంట్లో పెళ్లైనవారు ఇంకెవరైనా ఉన్నారా రామూ!

సోము: మా అమ్మానాన్నలు ఉన్నారు రా!