ఎక్కడెక్కడో పుట్టాము
    
సేకరణ: శ్రీ వెంకటేశ్, వంశీ, సాంస్కృతిక శిక్షణా కళాకారులు, అనంతపురం.
గానం: అనిత, తొమ్మిదవ తరగతి, ప్రకృతిబడి, చెన్నేకొత్తపల్లి
డప్పు: టి. సతీష్, తొమ్మిదవ తరగతి, ప్రకృతిబడి, చెన్నేకొత్తపల్లి.
 
ఎక్కడెక్కడో పుట్టాము ఎక్కడెక్కడో పెరిగాము
ఎక్కడెక్కడో పుట్టాము ఎక్కడెక్కడో పెరిగాము
అనుకోకుండా కలిసాము అందరమొకటిగ ఉన్నాము
అనుకోకుండా కలిసాము అందరమొకటిగ ఉన్నాము
మేమంతా ఒక గూటి పక్షులం 
టింబక్టు వృక్షం పైన చిగురించాము 
|ఎక్కడెక్కడో|
అమ్మా నాన్నా మాకున్నా అన్నా తమ్ముళ్ళు మాకున్నా
ఆటలు పాటలు అన్నీ ఉన్న టింబక్టు బడి మాకు మిన్న
ఒకరికి ఒకరం తోడుంటాం టింబక్టు బడిలో కలిసుంటాం  
|ఎక్కడెక్కడో|
కులమంటే తెలియదు మాకు మతమంటే చిరాకు మాకు
స్నేహానికి ప్రాణం ఇస్తాం సహవాసానికి మేమే రూపం
కలిసికట్టుగా ఉంటాము ఆనందంగా జీవిస్తాం  
|ఎక్కడెక్కడో|
 
వ్యాఖ్యలు  వారి సౌజన్యంతో