చందమామని మల్లి మాట అడిగే ఈ పాట, అనంతపురం జిల్లా 'కోలాటం' పాటల్లో ఒకటి. బహుశ: దీని పూర్తి పాఠం ఇది కాదేమో అనిపిస్తుంది వింటే. ఇంకా ఉండి ఉండాలి. మీకేమన్నా తెలిస్తే పంపండి.
గానం: అనిత, శారద మరియు కళావతి.
డప్పు: సతీష్, తొమ్మిదవ తరగతి.
చందమామా చందమామా చక్కనైన చందమామా!
మళ్ళీ అడుగుతున్నా మల్లి మాట చెప్పు మామా!
ఇంటి ముందర వనమంతా వనమూలో మనమంతా
మళ్ళీ అడుగుతున్నా మల్లి మాటా చెప్పుమామా!
చందమామా చందమామా చక్కనైన చందమామా!
మళ్ళీ అడుగుతున్నా మల్లి మాటా చెప్పుమామా!
చక్కనైన చందమామా ఏ చుక్కల్లో దాగుందో!
నీకు తెలిసి ఉంటే నాతో చెప్పీ పోరా మామా!