అడవుల కొండల గుట్టలకు
గానం: పుష్ప మరియు ఉష, ఏడవ తరగతి, ప్రకృతిబడి, చెన్నేకొత్తపల్లి.
డప్పు: పోతులయ్య
 
  
అడవుల కొండల గుట్టలకూ చందామామయలో.... చందామామయలో
నిప్పు పెట్టితే మనకే ముప్పు చందామమయలో                        
।అడవుల।
ఎండు కట్టెల కోసం మనమూ చందామామయలో..... చందామామయలో
మంటలు ఎగదోస్తున్నామూ చందామామయలో - చందామామయలో
అడవులు కొండలు కాల్చుకుపోతే చందామామయలో - చందామామయలో
వానలు మనకు కరువైపోతాయ్ చందామామయలో -  చందామామయలో   
।అడవుల।
అడవుల కొండల సరిహద్దుల్లో చందామామయలో..... చందామామయలో
బీడీ, సిగరెట్, అగ్గిపుల్లలూ - చందామామయలో - చందామామయలో
ఆర్పకుండా విసిరేయ్యొద్దు చందామామయలో - చందామామయలో
అడవులంటే అన్న దాతలు చందామామయలో- చందామామయలో 
।అడవుల।