ఓ యువతీ యువకుల్లారా
సామాజపు సారధులారా
ఈ దేశానికి మీరే యుగకర్తలు కావాలి
రేపటి తరానికీ మీరే మార్గదర్శకులవ్వాలి    
।ఓ యువతీ।

పేదరికం ఒక శాపం కాదు ఎవరి నుదుటా అది రాసిలేదు
ఏదో గ్రహణం పట్టింది-బ్రతుకును చీకటి అలుముకుంది
ఆ చీకటిని తరిమేసే కాంతి రేఖలుకావాలి
బ్రతుకు బాటను చూపాలి                   
।ఓ యువతీ।

కూడూ గూడూ లేక పడియున్న దీనులకు
ఎవరొస్తారని అలసిపోయిన అభాగ్య జీవులకు
మేమున్నామని చెప్పాలి-నమ్మకాన్ని పెంచాలి
ఎవరికి వారే బ్రతికేటందుకు శక్తిని మనమే ఇవ్వాలి  
।ఓ యువతీ।

ఎందరొ వీరుల త్యాగఫలం ఈ దేశానికి స్వాతంత్రం
మనకెందుకులే అనుకొంటే ఏమయ్యేదో ఈ దేశం
అదే స్ఫూర్తి మీలో ఉంటే-అందరమొక్కటే అనుకుంటే
సమసమాజ నిర్మాతలు మీరై సమానత్వమే చూపాలి
సహజీవనమే చెయ్యాలి                      
।ఓ యువతీ।
పాటలు వినడానికి Adobe Flash Player తెచ్చుకోండి.
Download this song