అందాల మా ఇల్లు
గానం: వి. రాజు, నాలుగవ తరగతి, ప్రకృతిబడి, చెన్నేకొత్తపల్లి, అనంతపురం జిల్లా.
 
  
అందాల మా ఇల్లు 
ఆనందాల హరివిల్లు
ఇంటి ముందర బాట 
ఇంటికి వెనుక తోట
మా ఇల్లు ఒక కోట 
గర్విస్తుంది మా పేట
అందాల మా ఇల్లు 
ఆనందాల హరివిల్లు
అమ్మా నాన్న అన్నయ్య
తాతా బామ్మా మామయ్య
జూలీ డాలీ రంగయ్య
మా ఇంట్లోని వాళ్లయ్య
అందాల మా ఇల్లు
ఆనందాల హరివిల్లు
శాంతికి నిలయం మా ఇల్లు
ప్రేమకు వలయం మా ఇల్లు
స్వచ్ఛత అంటే మా ఇల్లు 
క్రమశిక్షణకు మాఇల్లు
అందాల మా ఇల్లు 
ఆనందాల హరివిల్లు
ఇంటికి రాజు మా నాన్న
నాన్నకు తోడు మా అమ్మ
ఇంటికి రాణి మా అమ్మ
అమ్మకు తోడు అమ్మమ్మ
అందాల మా ఇల్లు 
ఆనందాల హరివిల్లు