పెద్దవంకలో గంగమ్మ తల్లి గలగల 
గానం: టి.సతీష్, అనిత, శారద, కళావతి.
డప్పు: టి. సతీష్
 
పెద్దవంకలో గంగమ్మ తల్లి గలగల పారాలి
ఏరువాకలో ఎంకిపాటతో నాగలి నవ్వాలి
సాలు సాలుకు నేలతల్లికి పువ్వులు పూయాలి
బీడు భూముల్లో పంటల పండుగ నిండుగ జరగాలి
కదలి రావమ్మా గంగమ్మ తల్లి రైతు కంటనీరు తుడవాలి తల్లి
కరువు సీమకు కదలి రావమ్మా, పెద్ద వంకగా పారాలమ్మా
పల్లె పల్లెల్లో.....ఓ...హొయ్
పల్లె పల్లెల్లో రైతులు కదిలి నీ రాకకై చూస్తారమ్మా
సాలు సాలుకు నీ సాయంతో వ్యవసాయాన్ని చేస్తారమ్మా         
|పెద్ద|
పెద్ద వంకలో పారేటి నీటిలో నెలవంక చూసి మురిసిపోవాలి
కాల్వల్లో నీరు పరుగులు తీస్తూ కయ్యలో నీరు నిలిచిపోవాలి
బీడు భూములన్నీ....ఓ..హొయ్
బీడు భూములన్ని తడితో తడిపి నేలకు నీరును నింపాలమ్మా
బోరు బావుల్లో నీళ్ళను నింపి భూగర్భ జలాలు పెంచాలమ్మ
|పెద్ద|
రైతు గుండెకు దిగులే వద్దు దిగుబడులెన్నో పెంచాలమ్మా
నల్ల రేగళ్లలో నేలకొంగిన పంటలెన్నో పెరగాలమ్మా
కరువు భూమిలో...ఓ...హొయ్
కరువు భూమిలో రైతులకంతా మెతుకు ముద్దను అందిచమ్మా
అన్నదాతకు అమ్మవు నీవే అన్న పూర్ణగా కొలిచామమ్మా
|పెద్ద|
అప్పులు తిప్పలు తీరిపోవాలి ఉప్పెన వంకగ పారాలమ్మా
ఎర్ర గుడిలో గుడినే కడతాం - బెల్లం ఎంకన్ని అల్లుకుపోమ్మా
ఊటకల్లుల్లో....ఓ...హొయ్
ఊటకల్లుల్లో ఊటగ ఊరి పూటకుపూటకు పారాలమ్మా
జొన్నగిరిలో జలజల రాలుతూ, ధాన్యపు రాసులు పండాలమ్మా
|పెద్ద|