ఓ యువతీ యువకుల్లారా సామాజపు సారధులారా ఈ దేశానికి మీరే యుగకర్తలు కావాలి రేపటి తరానికీ మీరే మార్గదర్శకులవ్వాలి ।ఓ యువతీ। పేదరికం ఒక శాపం కాదు ఎవరి నుదుటా అది రాసిలేదు ఏదో గ్రహణం పట్టింది-బ్రతుకును చీకటి అలుముకుంది ఆ చీకటిని తరిమేసే కాంతి రేఖలుకావాలి బ్రతుకు బాటను చూపాలి ।ఓ యువతీ। కూడూ గూడూ లేక పడియున్న దీనులకు ఎవరొస్తారని అలసిపోయిన అభాగ్య జీవులకు మేమున్నామని చెప్పాలి-నమ్మకాన్ని పెంచాలి ఎవరికి వారే బ్రతికేటందుకు శక్తిని మనమే ఇవ్వాలి ।ఓ యువతీ। ఎందరొ వీరుల త్యాగఫలం ఈ దేశానికి స్వాతంత్రం మనకెందుకులే అనుకొంటే ఏమయ్యేదో ఈ దేశం అదే స్ఫూర్తి మీలో ఉంటే-అందరమొక్కటే అనుకుంటే సమసమాజ నిర్మాతలు మీరై సమానత్వమే చూపాలి సహజీవనమే చెయ్యాలి ।ఓ యువతీ।