ఎక్కడెక్కడో పుట్టాము ఎక్కడెక్కడో పెరిగాము ఎక్కడెక్కడో పుట్టాము ఎక్కడెక్కడో పెరిగాము అనుకోకుండా కలిసాము అందరమొకటిగ ఉన్నాము అనుకోకుండా కలిసాము అందరమొకటిగ ఉన్నాము మేమంతా ఒక గూటి పక్షులం టింబక్టు వృక్షం పైన చిగురించాము |ఎక్కడెక్కడో| అమ్మా నాన్నా మాకున్నా అన్నా తమ్ముళ్ళు మాకున్నా ఆటలు పాటలు అన్నీ ఉన్న టింబక్టు బడి మాకు మిన్న ఒకరికి ఒకరం తోడుంటాం టింబక్టు బడిలో కలిసుంటాం |ఎక్కడెక్కడో| కులమంటే తెలియదు మాకు మతమంటే చిరాకు మాకు స్నేహానికి ప్రాణం ఇస్తాం సహవాసానికి మేమే రూపం కలిసికట్టుగా ఉంటాము ఆనందంగా జీవిస్తాం |ఎక్కడెక్కడో|