ఉత్తర ఆఫ్రికాలో ఈజిప్టుకు దక్షిణంగా, ఇథియోపియాకు పడమరగా, లిబియాకు ఆగ్నేయంగా ఉన్నది రిపబ్లికి ఆఫ్ సూడాన్. ఆఫ్రికాలోని అతి పెద్ద దేశాలలో ఇది మూడవది. నైలునది ఈ దేశాన్ని రెండు భాగాలుగా విభజిస్తున్నది.
నైలు నదీలోయా నాగరికత 3300BC నాడు వెల్లి విరిసింది ఇక్కడే.
ఆఫ్రికా-అరబ్ ప్రపంచంలో అతి పెద్ద దేశంగా వెలుగొందిన సూడాన్ 2011లో 'దక్షిణ సూడాన్' మరో దేశంగా మారి విడిపోవడంతో 3వ స్థానానికి పడిపోయింది (అల్జీరియా, కాంగో దీనికంటే పెద్ద దేశాలు)
ముస్లిం చట్టాన్ని అనుసరించే సిరియాకు రాజధాని ఖర్తూమ్. సూడాన్‌లో మధ్యభాగం, ఉత్తరభాగం ఎడారులు నూబియన్ ఎడారి, బయూడా ఎడారి చాలా వేడిగానూ, పొడిగానూ ఉండే ఎడారులు; కాగా సూడాన్ దక్షిణాన బురద భూములు, దట్టమైన అడవులు ఉన్నాయి. ఎడారుల్లో 'హబూబ్' అనే ఇసుక తుఫానులు ఒక్కోసారి సూర్యుణ్ని పూర్తిగా కప్పివేస్తుంటే, మిగిలిన ప్రాంతాల్లో ప్రజలు గొర్రెలు, ఒంటెలను కాపుకుంటూ సంచార తెగలుగా జీవిస్తుంటారు. నైలునదికి దగ్గరలో నున్న కొన్ని ప్రాంతాలలో మటుకు సాగునీటితో కూడిన వ్యవసాయం కనబడుతుంది.
ఎడారీకరణ సూడాన్ ఎదుర్కొనే అతి పెద్ద కష్టాల్లో ఒకటి. పెట్రోలియం నిల్వలు సూడాన్‌కు వెలలేని నిధులు. సూడాన్‌లో బంగారం, వెండి, మాంగనీస్, మైకా, జింక్, కోబాల్ట్ లతో పాటు రాగి, ఇనుము, సీసం సహజవాయువు మొదలైన ఖనిజాలు కూడా విపరీతంగా లభిస్తాయి. చారిత్రకంగా అనేక శతాబ్దాల పాటు ఈజిప్టులో భాగంగా బ్రిటీషు పరిపాలనలో ఉండింది సూడాన్.
1952లో జరిగిన ఈజిప్టు విప్లవం కారణంగా సూడాన్ విమోచన ఆరంభమైంది. 1956లో బ్రిటీషు వారి నుండి, ఈజిప్టు ఆధిపత్యం నుండి విడి వడి స్వతంత్ర దేశమైంది సూడాన్.
అయినా చారిత్రకంగా సూడాన్ ఏనాడూ ప్రశాంతంగా ఉండింది లేదు. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా సూడాన్ అంతర్యుద్ధం, రక్తపాత విప్లవాలు, తిరుగుబాట్లు, ఇతరదేశాల దురాక్రమణలు అనుభవిస్తూనే వచ్చింది. సూడాన్ ప్రభుత్వాధినేతలంతా సైనిక అధికారులు, నియంతలు, తీవ్రవాదులే అయినారు. అమెరికాకు వ్యతిరేకంగా పోరాడిన 'ఒసామా బిన్ లాడెన్'కు మిత్రులై, వీరంతా సూడాన్‌కు పశ్చిమ దేశాలచేత తీవ్రవాద దేశంగా ముద్రపడేట్లు చేశారు. 1998లో అమెరికా సూడాన్ పైకి దండెత్తి అనేక ప్రాంతాలలో బాంబులు వేసింది. ఏనాడూ సరిగా లేని సూడాన్ జన జీవితం దాంతో మరింత అస్తవ్యస్తం అయ్యింది.
అగ్రరాజ్యాలతో సూడాన్ దేశపు తీవ్రవాద సంస్థల పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. కొత్త సంవత్సరం ప్రారంభంలో ఫ్రాన్సుపై జరిగిన ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదుల దాడి సూడాన్‌కు, పశ్చిమ దేశాలకు మధ్య కొనసాగుతున్న వైషమ్యాలను మరింత పెంచింది. సిరియాపై ఇప్పుడు అమెరికాతోబాటు, ఫ్రాన్సు కూడా కక్ష సాధింపు చర్యలు చేపట్టింది. సిరియాలోని విభిన్న తీవ్రవాద తెగలతోబాటు సాధారణ ప్రజలు కూడా పశ్చిమదేశాల ఈ తెగబాటును తీవ్రంగా ఎదుర్కొంటున్నారు.