జోకులు
సుపుత్రుడు!
పిచ్చమ్మ: భోజనం బాగోలేదంటూ అబ్బాయి ఉత్తరం రాశాడండి.
తిక్కన్న: అలాంటప్పుడు వేరే హోటల్కెళ్ళి తినొచ్చు కదా!
పిచ్చమ్మ: అలా తినడం జైల్లో కుదరదండి.
తొందర!
తండ్రి: నీకు పరీక్షలో వందకు తొంభై మార్కులు వస్తే ఐస్‌క్రీం కొనిపెడతా...
చింటు: అప్పటి వరకూ ఉంటే ఐస్‌క్రీం కరిగిపోతుంది.. ఇప్పుడే కొనివ్వండి నాన్నా!
నీకోసం!
పొరుగమ్మ: ఏంటొదినా, టీ గిన్నె కడక్కుండానే మళ్ళీ టీ చేస్తున్నావు? అట్లా చేస్తే టీ బాగుంటుందీ!?
ఇరుగమ్మ: నేను అసలు టీ తాగనమ్మా, ఇది నీ కోసమే కదా అని...
మనదే తెలివి!
టీచర్: రెండో ప్రపంచ యుద్ధం వల్ల మనందరం చాలా నష్టపోయాం. ఇప్పుడిక మూడో ప్రపంచ యుద్ధం వస్తే ఏమౌతుందో ఊహించండి.
క్రాంతి (తన ప్రక్కనున్న పిల్లాడితో గుసగుసగా): టీచర్‌కి మతి పోయినట్లుందిరా! నిన్నేమో 'ప్రపంచం ఒక్కటే' అని చెప్పింది, ఇవాళ్ళేమో రెండో ప్రపంచం అంటోంది! (సేకరణ: చదువుల క్రాంతి, శ్రీకాకుళం.)
అన్నీ ఒకటే రేటు!
కస్టమర్: ఏది కొన్నా వంద రూపాయలేనా?
యజమాని: అవును అన్నీ ఒకటే ధర...
కస్టమర్: అయితే ఈ వంద తీసుకొని మీ ముందున్న గల్లా పెట్టె ఇవ్వండి!
టిప్పు!
హెడ్మాస్టరు (కొత్తగా చేరుతున్న పాపతో) : నీ పేరేంటి పాపా?
పాప: టిప్పు
హెడ్మాస్టరు: ముద్దు పేరు కాదు పాపా, అసలు పేరు చెప్పు
పాప: నా అసలు పేరే టిప్పు సార్!
హెడ్మాస్టరు: అదేంటమ్మా?! మీ నాన్న టిప్పుసుల్తాన్ అభిమానా?
పాప: అదేం కాదు సర్, ఆయన హోటల్లో సర్వర్‌గా పని చేస్తాడు. అందుకని నాకు ఈ పేరు పెట్టాడు.
సూపర్ బద్ధకం
పేషంట్: డాక్టరు గారూ! నాకు బద్ధకం మరీ ఎక్కువైందండీ! ఏదైనా మందు ఇవ్వండి.
డాక్టరు: ఆ సంగతి మీకు ఎలా తెలిసింది? మీ బద్ధకం ఎలా ఉంటుందో చెప్పండి.
పేషంట్: ఇంతకు ముందు నిద్రలో నడిచేవాణ్నండీ, ఇప్పుడు బద్ధకం ఎక్కువై అదీ మానేశాను!
ఆదర్శ ఉద్యోగి!
ఇంటర్వ్యూ ఆఫీసర్: నీ బలహీనతలేంటి?
రాజేష్: నేను ఆఫీసు నుండి ఇంటికి వెళదామనుకున్నాక ఇంక ఏపనీ చేయను.
ఆఫీసర్: ఓహోఁ మరి నీ బలాలేంటి?
రాజేష్: ఆఫీసుకు వచ్చేంత వరకూ నేను ఇంటికి వెళదామనుకోను.
ముందు జాగ్రత్త!
"ఆపరేషన్ థియేటర్లో పూలదండ ఎందుకు పెట్టారండి?” అడిగాడు పేషెంట్ అమాయకంగా.
"ఆపరేషన్ సక్సెస్ అయితే డాక్టర్ మెడలో వేయడానికి, ఫెయిలయితే నీ మెడలో వేయడానికి!” చెప్పి నాలుక కరుచుకుంది నర్స్
సూక్తులు
కొట్టకుండా, తిట్టకుండా విద్య నేర్పే ఉపాధ్యాయుడే నిజమైన గురువు.
సోమరితనం కంటే దారుణమైన శత్రువు మరొకటి లేదు
ఆలోచనల్లో నిర్మలత, మాటల్లో స్పష్టత, చేతల్లో సహృదయత- ఇవే ఆదర్శ జీవనపు లక్ష్యాలు
పరాజయం ఎరుగని ఆయుధం సుజ్ఞానం