ఈ బొమ్మను చూడండి!
పట్నంలో చదువుకునే సుభాష్ పల్లెకొచ్చి, ఎద్దులబండి ఎక్కాల్సి వచ్చింది.
దుమ్ము పీల్చుకోలేకనో, మరి ముఖం దాచుకుందామనో, ముఖానికో గుడ్డ కట్టుకున్నాడతను. చిన్నప్పుడు తనతోబాటే చదివిన ఎర్రయ్య బండిని నడిపిస్తున్నాడు. ఎద్దులేమో కష్టపడి పబండి లాగుతున్నాయి. వీళ్ళ కథ ఏంటో తెలుసా మరి, మీకు? తెలిస్తే రాసి పంపండి. బాగున్న కథని కొత్తపల్లి-60 లో ప్రచురిస్తాం!