కవితలు

1. అమ్మ (రచన:సింహాద్రి, సంతోష, 7వతరగతి, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, టెక్కలి.)

అమ్మ ఉంటే జీవితం
లేదంటే దు:ఖం
అమ్మను మోసం చేయకు
అవమానం పాలవ్వకు

అమ్మా, నాన్నా నీ కోసం
నువ్వూ నీ చదువూ వాళ్ళ కోసం
కష్ట పడితేనే సుఖం
సుఖం కోరితే కష్టం!

నువ్వు కష్టపడి దేశాన్ని సుఖపెట్టు
అందరూ కలసి కష్టపడితే - అందరూ కలసి సుఖపడతారు

అమ్మ ఉంటేనే పిల్లలు!
అమ్మ లేనిదే కల్లలు
అమ్మ అంటే రెండు అక్షరాలు కావు
అమ్మ అంటే ప్రేమకు లక్ష వరాలు.

2. నేనూ-నా భాష (రచన: డి.హేమసుందర్, 7వతరగతి, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, టెక్కలి.)

అమ్మంటే నాకిష్టం
mummy అంటే తనకిష్టం

నాన్నంటే నాకిష్టం
daddy అంటే తనకిష్టం

చేపంటే నాకిష్టం
fish అంటే తనకిష్టం

జాంపండంటే నాకిష్టం
guava అంటే తనకిష్టం

భాషంటే నాకిష్టం
Language అంటే తనకిష్టం

తెలుగంటే నాకిష్టం
English అంటే తనకిష్టం

సులువైన సొంత భాషంటే నాకిష్టం
ఇంగ్లీషులో నెగ్గాలంటే తెలుగే శ్రేష్ఠం

3. చందమామ-నెహ్రూ మామ!
(రచన: కె.తిరుపతిరావు,7వ తరగతి, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, టెక్కలి)

చందమామ-నెహ్రూమామ
చందమామ నవ్వితే మల్లె పువ్వు
నెహ్రూ మామ నవ్వితే గులాబి పువ్వు

చంద మామ ఇచ్చేది వెన్నెల
నెహ్రూ మామ ఇచ్చేది నవ్వులు

చందమామకి శుక్లపక్షం కృష్ణపక్షం
నెహ్రూ మామ ఎప్పుడూ పిల్లల పక్షం

చందమామ చుట్టూ నక్షత్రాలు
నెహ్రూ మామ చుట్టూ పిల్లలు

చందమామ దేశానికి వెలుగు
నెహ్రూ మామ బాలలకు వెలుగు

చందమామ ఆకాశంలో
నెహ్రూ మామ పిల్లల్లో.


జోకులు

నిజంగా కట్టిందెవ్వరు?
టీచర్: బాలూ! చార్మినార్ ఎవరు కట్టారో తెలుసా?
బాలు: ఓ, తెలుసు టీచర్! చార్మినార్‌ను మేస్త్రీలు కట్టారు.

పీల్చు-వదులు!
డాక్టర్: ఏమయ్యా, ముసలాయనా! హాస్పటల్‌లో "పొగత్రాగరాదు" అని అంత పెద్ద అక్షరాలతో రాసి పెట్టామే! మరి నువ్వు చేస్తోందేమిటయ్యా?!
ముసలాయన: అయ్యో, సార్, నేను పొగత్రాగటం లేదు సార్, ఊరికే పీల్చి వదిలేస్తున్నాను- అంతే సార్!
( సేకరణ:యు.కనకరాజు,8వ తరగతి, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, టెక్కలి)

ఎవరి ఏడుపు వాళ్లది!
యజమాని: రంగయ్యా! పాప కూర్చుని ఏడుస్తుంటే నువ్వు ఏం చేస్తున్నావయ్యా?
రంగయ్య: నేను కూడా కూర్చుని ఏడిస్తే బాగుండదు కదా, బాబయ్యా!

ఆవు సమస్య!
రాము: సోమూ, భీమూ! ఆవు ఎలా ఉంటుంది?
సోము: ఆవు, ఆవు లాగే ఉంటుంది.
భీమ: ఆవు గడ్డితింటూ ఉంటుంది.
రాము: మీ ఇద్దరూ తప్పు చెప్పారు.
భీమ: మరి నువ్వు చెప్పరా, ఎట్లా ఉం టుంది ఆవు?
రాము: ఆవును తాడుతో కట్టేస్తే ఉంటుంది.

గంధర్వ గానం!
సుబ్బారావు: నిన్న రాత్రి మీరు చేసిన సాయాన్నిఈ జన్మలో మరిచి పోలేనండీ!
రామారావు(ఆశ్చర్యంగా): నేనేం చేశానండీ!?
సుబ్బారావు: రాత్రి మీరు పాడేపాటలు విని, మా బంధువులు పారిపోయారు.
( సేకరణ: ఎన్.వెంకటరమణ, 8వతరగతి, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, టెక్కలి.)