పిల్లలం- చిన్న పిల్లలం     
   పిల్లలం- పసి  పిల్లలం    
చక చక బడికి వచ్చేస్తాం    
   ఆటలు  ఎన్నో ఆడేస్తాం        "పిల్లలం"   
   పాటలు ఎన్నో పాడేస్తాం    
   ప్రకృతి  ఒడిలో  శాస్త్రవేత్తలం        "పిల్లలం "   
గురువులు చెప్పిన పాఠం వింటాం    
   పెద్దలు చెప్పిన  మాటలు అంటాం       "పిల్లలం "    
పుస్తకాలు  ఎన్నో  చదివేస్తాం    
   పాఠాలెన్నో  నేర్చేస్తాం        "పిల్లలం "     
నిజాలు మేమే  చెప్పేస్తాం    
   ఎక్కడ  చూసిన అక్కడ మేమే!        "పిల్లలం "    
పద్యాలెన్నో  నేర్చేస్తాం    
   నీతులు ఎన్నో  పాటిస్తాం        "పిల్లలం "   
   చకచక  రాతలు రాసేస్తాం    
   గడ  గడ  చదువు చదివేస్తాం       "పిల్లలం "    
మట్టిని పిసికి  మెత్తగ చేసి    
   బొమ్మలు ఎన్నో చేసేస్తాం        "పిల్లలం"    
   ఇసకతో ఇళ్ళు కట్టేస్తాం    
   కాగితాలతో పువ్వులు చేస్తాం        "పిల్లలం"    
అందరమొకటై నిలబడతాం     
   ఫలితాలెన్నో సాధిస్తాం        “పిల్లలం"


