తెలుగులోని తియ్యదనం     
   తెలుగు నేల సనాతనం    
   తేట  తెనుగు మనకు వరం   
   తెలుగే  మన  మూల  ధనం   
   తెలుగు భాష  మనకు  శ్వాస   
   తెలుగు  మాట  మణి  పూస   
   తెలుగు వెలుగు  మనకు  రక్ష   
   తెలుగే  పెదబాలశిక్ష   
   తెలుగు తల్లి  కల్పవల్  లి     
   తెలుగు  మనకి అమృత  వల్లి    
   తెలుగు భాష  పూల జల్లు    
   తెలుగే  ఒక  హరివిల్లు   
   తొలి కవి 'నన్నయ్య ' తెలుగు   
   'అన్నమయ్య ' పాట  తెలుగు    
   'వేమన ' పద్యం  తెలుగు    
   'ఎంకి ' పాటె  అచ్చ తెనుగు  
   'విశ్వనాధ' కవిత  తెనుగు   
   'కందుకూరి ' చేవ  తెలుగు   
   'గురజాడ ' ముత్యాల  తెలుగు   
   'శ్రీ శ్రీ ' భావాగ్ని  తెలుగు   
   యుగ యుగాల  తెలుగు నింపు    
   తెలుగు  మాటలెల్ల  కలుపు   
   అమృత  భాష  మన  తెలుగు   
   తెలుగే  మన కాది వెలుగు   
   తేనె  తెలుగు  పలుకరింపు   
   తెలుగు నుడల  పోహళింపు   
   తెలుగు జగతి వెలుగు  నింపు   
   తెలుగే  మన  కీర్తి  నిలుపు


