చెట్లు కొట్టగా పాలు కారగా   
   నిన్ను కొట్టగా నీరు కారగా    
   చెన్నపట్నం డుర్రుచ్చి    
   డుర్రుచ్చీ, డుర్రుచ్చి!    
మట్టి కొట్టగా దుమ్ము రేగగా    
   నిన్ను కొట్టగా  నేయి కారగా     
   విశాఖపట్నంవెర్రొచ్చి    
   వెర్రొచ్చీ, వెర్రొచ్చి!    
కొమ్మ కొయ్యగా పలుకు తేరగా    
   నిన్ను కొయ్యగా నిగ్గు తేరగా    
   కళింగపట్నం కిర్రుచ్చి    
   కిర్రుచ్చీ, కిర్రుచ్చి!    
ఉట్టి తొయ్యగా గట్టు చేరగా    
   నిన్ను తొయ్యగా ఊరు చేరగా    
   మచిలీపట్నం రేవొచ్చి,    
   రేవొచ్చీ, రేవొచ్చి!
   
   
