అక్షరాలలో ఉంది   
   అనంతమైన శక్తి    
   విద్యాదీపం వెలిగించి    
   విజ్ఞాన కాంతులు వెదజల్లే    
   "అక్షరాలలో ఉంది"    
అక్షరము-అక్షరము   
   అగును కలిపితే పదము    
   పదమూ పదముల సముదాయం    
   అదేకదా మరి కావ్యం?!    
   "అక్షరాలలో"    
మూగమనసుకు కలుగు అక్షరం    
   గ్రుడ్డి కనులకు వెలుగు అక్షరం    
   విద్యా విహీనమైన వానికి    
   విశ్వం అంతా శూన్యం    
   "అక్షరాలలో"    
గండశిలలపై చరిత్రలున్నా    
   గ్రంథపు పుటల శాస్త్రాలున్నా    
   అనంతమౌ విజ్ఞాన వ్యాప్తికి    
   అక్షరాలే మూలం    
   "అక్షరాలలో"
