అ ఆ ఇ ఈ నేర్పండి అయ్యవారూ
హ క్ష దంక అక్షరాలు యాభైఆరు!

ఉయ్యాల జంపాల ఉ ఊ ఋ ౠ
ఎక్కడ- ఏవీ ఎ ఏ ఐ
ఓహో ఓహో ఒ ఓ ఔ
అం మం మం మం మ!
అ: హహ్హ హ్హహ!
"అ ఆ ఇ ఈ నేర్పండి"

కల కల లాడే గమ గమ లాడే
క ఖ గ ఘ ఙ
చక చక నడిచే జర జర జారే
చ ఛ జ ఝ ఞ
"అ ఆ ఇ ఈ నేర్పండి"

టం టం టం టం-డం డం డం డం
ట ఠ డ ఢ ణ
తథితై తథితై -దధితోం‌ దధితోం
త థ ద ధ న
"అ ఆ ఇ ఈ నేర్పండి"

పక పక నవ్వే బాలలము
ప ఫ బ భ మ
యరలవ యరలవ
గిర గిర యరలవ
గిరగిర గిరగిర
యరలవ గిరగిర
శ ష స హ క్ష!
"అ ఆ ఇ ఈ నేర్పండి"

పాటలు వినడానికి Adobe Flash Player తెచ్చుకోండి.
Download this song