తేనెల తేటల మాటలతో

మన దేశ మాతనే కొలిచెదమా

భావం భాగ్యం కూర్చుకొని - ఇక

జీవనయానం చేయుదమా

సాగర మేఖల చుట్టుకొని - సుర

గంగ చీరగా మలచుకొని

గీతాగానం పాడుకునీ - మన

దేవికి ఇవ్వాలి హారతులు... "తేనెల"

గాంగ జటాధర భావనతో - హిమ

శైల రూపమే నిలబడగా

గలగల పారే నదులన్నీ - ఒక

బృంద గానమే చేస్తుంటే..... "తేనెల"

ఎందరో వీరుల త్యాగఫలం - మన

నేటి స్వేచ్ఛకే మూలబలం

వారందరినీ తలచుకొని - మన

మానస వీధిని నిలుపుకొని..... "తేనెల"

పాటలు వినడానికి Adobe Flash Player తెచ్చుకోండి.
Download this song