చెల్లీ రావే! సిరిమల్లీ రావే!
అడవితల్లి ఒడిలో
ఆడుకుందమురావె! (2)
పసుపు పచ్చాని చీర
కట్టుకున్న
అడవి తల్లిని చూడు!
ఆమె అందము చూడు! "చెల్లీ రావే!"
కొండ కోన - వాగు వంక
వయ్యారము చూడు! వంపు సొంపులు చూడు! "చెల్లీ రావే!"
వానజల్లు వరద చూడు!
పొంగుతున్న సెలయేరులు చూడు! "చెల్లీ రావే!"
చింత చెట్టు చిగురు చూడు!
చెట్టుమీద చిలుక పలుకులు చూడు! "చెల్లీ రావే!"
కుంకుడు చెట్టు పువ్వులు చూడు!
విప్ప చెట్టు మీద - తేనె పట్టును చూడు! "చెల్లీ రావే!"
సీమ గరిక దూది పరుపుల మీద
చిందులేసే లేగదూడను చూడు! "చెల్లీ రావే!"
అంబా అంటూ తన బిడ్డను పిలిచే
తెల్లావును చూడు! దాని ప్రేమను చూడు! "చెల్లీ రావే!"