చెట్టుచేమా పెరిగిన కొండ

భూమాతకు పూలదండ

పచ్చని పైరే పట్టుచీర

వాగు వంక గజ్జెల మోత

వసంతకాలం కోకిల కూత

ఏరువాకలో ఎద్దుల రంకె

ప్రపంచానికి ప్రాణాలన్నా

పంచ భూతాలే దైవాలన్నా

"చెట్టుచేమా..."

సంస్కారమే నీలో ఉంటే- నమస్కారమే నింగికి చెయ్యి

ముందుచూపే నీలో ఉంటే- నీటిబొట్టును ఆదా చెయ్యి

ప్రాణాధారం కావాలంటే- భూమాతకు సాయం చెయ్యి

మంచిని నీవు పెంచాలంటే పచ్చని చెట్లను పెంచాలోయ్

"చెట్టుచేమా..."

కొమ్మను రెమ్మను పెంచావంటే మేఘాలనే రమ్మని పిలుచును

మేఘాలన్నీ వచ్చాయంటే చినుకుల సవ్వడి వర్షం వచ్చును

పంటలన్నీ విరివిగా పండి- ధాన్యపు రాసులు దైవంబవును

భూమాతను కాపాడితే- అమ్మను కొమ్మను పెంచును

"చెట్టుచేమా..."

కోటి వరాలు కొండను ఇచ్చు- వాన వెలుతురు నింగే ఇచ్చు

వరద నీటిని వదలొద్దన్నా- భూగర్భ జలాలు పెంచాలన్నా

ఇంటింటా ఒక మొక్కను పెంచు- పంచభూతాలు నిన్నే మెచ్చు

తెలుసుకుంటే సత్యమిది- తలుచుకుంటే సాధ్యమిది

"చెట్టుచేమా..."

పాటలు వినడానికి Adobe Flash Player తెచ్చుకోండి.
Download this song