కార్తులన్ని ఆయెను-

కాలమే అయిపోయెను

వానమబ్బు పల్లెపై-

వంగి కురవదాయెను

"కార్తులన్ని.."

ఆకశాన మేఘాలు ఆశలెన్నో రేపెను

కొమ్మలూపు చిరుగాలి నమ్మకాన్ని పెంచెను

మరుక్షణమేమాయెనో మబ్బులు ఎటు పోయెనో

హోరు జోరు తగ్గెను ఊరు మాటు మనిగెను

"కార్తులన్ని..."

చెమ్మలేక శనగ చేను సొమ్మసిల్లి పోయెను

నీరు లేక వరి పైరు నీరసించి పోయెను

పైరులెండి పోయెను పంట నష్టమాయెను

దిక్కులేని రైతుకు దు:ఖమే మిగిలేను

"కార్తులన్ని..."

సేద తీర్చుకోలేక చెరువు గుండె పగిలెను

బాధ నోర్చుకోలేక బావి గొంతు పూడెను

ఏరు కూడ ఏడ్చెను వాగు కూడా వగిసెను

పల్లెలంతా వానకై తల్లిడిల్లి పోయేను

"కార్తులన్ని..."

పాటలు వినడానికి Adobe Flash Player తెచ్చుకోండి.
Download this song