ఆదివారము నాడు అరటి మొలిచింది
సోమవారము నాడు సుడివేసి పెరిగింది
మంగళవారము నాడు మారాకు తొడిగింది
బుధవారము నాడు బుడ్డి గెల వేసింది
గురువారము నాడు గుబురులో దాగింది
శుక్రవారము నాడు చూడగా పండింది
శనివారము నాడు చకా చకా గెలకోసి-
ఆదివారము నాడు అందరికి పంచితిమి అరటి హస్తములు.